మూడో రోజు పెరిగిన పెట్రోల్ ధర

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్ ధరలు వరుసగా మూడో రోజు కూడా పెరిగాయి. దేశ రాజధానిలో 17 పైసలు పెరగ్గా లీటర్ పెట్రోల్ ధర రూ.80.90, హైదరాబాద్‌లో లీటర్‌కు రూ.84.07కి చేరింది. దాదాపు 50 రోజుల తర్వాత ఆదివారం 14 పైసలను పెట్రోల్ ధరలను చమురు సంస్థలు పెంచాయి. జూన్ 29 నుంచి ఢిల్లీలో పెట్రోల్ రేటు లీటర్‌కు రూ.80.43 ఉండగా, ప్రస్తుతం రూ.80.90కు చేరింది. ముంబైలో పెట్రోల్ లీటర్‌కు రూ.87.58, హైదరాబాద్‌లో రూ.84.07, చెన్నైలో 83.99, బెంగళూరులో 83.52, కోల్‌కతాలో 82.43కి చేరాయి. గత మూడు రోజుల్లో 47 పైసల వరకు చమురు కంపెనీలు పెంచాయి. నిత్యం చమురు సంస్థలు ధరలపై సమీక్షిస్తుండగా.. రేట్లు పెరుగుతున్నాయి. కాగా, డీజిల్ ధరల్లో గత 20 రోజులుగా ఎలాంటి మార్పు కనిపించలేదు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/