కాంగ్రెస్‌లోకి మోత్కుపల్లి..?

సీనియర్ రాజకీయ నేత మోత్కుపల్లి నరసింహులు కాంగ్రెస్ పార్టీ లోకి చేరేందుకు సిద్దమయ్యారా..? అంటే అవుననే అంటున్న రాజకీయ వర్గాలు. కాంగ్రెస్ లో చేరి మళ్లీ తుంగతుర్తి నియోజకవర్గం నుండి పోటీ చేయాలనీ చూస్తున్నారని అంటున్నారు. మోత్కుపల్లి టీడీపీలో చేరి దశాబ్దాల పాటు ఆ పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత బిజెపి , కాంగ్రెస్ లో చేరారు. కానీ ఎక్కడ కూడా తనకు తగిన ప్రాధాన్యం దక్కలేదు.

దీంతో కాంగ్రెస్లో చేరి పూర్వ వైభవం తెచ్చుకోవాలని చూస్తున్నారట. ఇప్పటికే స్థానిక హస్తం నేతలతో, ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో కూడా సంప్రదించారని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో మోత్కుపల్లిని ఆదరించిన తుంగతుర్తి ప్రజలు ఈసారి కూడా ఆదరిస్తారా లేదా ? అనే ప్రశ్న అందరి ముందు ఉంది. 2009 ఎన్నికలలో స్థానికేతరుడైన మోత్కుపల్లిని గెలిపించిన తుంగతుర్తి నియోజకవర్గం ప్రజలు ఈసారి ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.