రేపు మునుగోడులో బహిరంగ సభ..అభ్యర్థిని ప్రకటించనున్న సిఎం కెసిఆర్
మధ్యాహ్నం 2 గంలకు సభ మొదలు

హైదరాబాద్ః కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ ద్వారా దక్కిన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో మునుగోడుకు ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా రాష్ట్రంలోని 3 ప్రధాన పార్టీలు ఈ ఎన్నికకు సంబంధించిన తమ అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించలేదు. అయితే రేపు (శనివారం) మునుగోడులో జరగనున్న బహిరంగ సభలో టిఆర్ఎస్ తన అభ్యర్థిని ప్రకటించనుంది.
మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని టిఆర్ఎస్ ఇప్పటికే సూత్రప్రాయంగా ఖరారు చేసింది. ఈ విషయాన్ని రేపటి మునుగోడు సభలో సిఎం కెసిఆర్ అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ క్రమంలో రేపు మునుగోడు మండల కేంద్రంలో జరగనున్న బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్ను టిఆర్ఎస్ శుక్రవారం ఆవిష్కరించింది. ఈ సభకు ప్రజా దీవెన సభ అనే పేరు పెట్టింది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు జరగనున్న ఈ సభలో మునుగోడు ప్రజలను ఉద్దేశించి కెసిఆర్ ప్రసంగించనున్నారు. అదే సమయంలో పార్టీ తరఫున బరిలో నిలిచే అభ్యర్థి పేరును కెసిఆర్ ప్రకటించనున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/