ప్రధాని మోడికి రేవంత్ రెడ్డి లేఖ
శ్రీశైలం ప్రమాదం ఘటనలో .. సీబీఐతో పాటు ఎలక్ట్రిసిటీ అథారిటీతో విచారణ జరిపించాలి

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ఎంపి రేవంత్రెడ్డి శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోడికి లేఖ రాశారు. ఈ ఘటన వెనుక క్రిమినల్ కోణం ఉందని లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రమాదం వల్ల రూ. వందల కోట్ల నష్టం జరిగిందని చెప్పారు. ఘటనపై సీబీఐతో పాటు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీతో విచారణ జరిపించాలని కోరారు. సీబీఐ విచారణలో అసలైన విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. జెన్ కో, ట్రాన్స్ కోలకు అనుభవం లేని ప్రభాకర్ రావు ఎండీగా ఉండటం వల్ల ఆ సంస్థలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని అన్నారు. ప్రభాకర్ రావు హయాంలో ఇచ్చిన టెండర్లు, విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరిపించాలని కోరారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/