బ్రిటన్‌ పార్లమెంట్‌ వద్ద నిరసనలు

Baloch, Sindhi jointly hold anti-Pakistan protest at UK Parliament

లండన్‌: సింధు బలోచ్ ఫోర‌మ్‌కు చెందిన నిర‌స‌న‌కారులు లండ్‌న్‌లో పార్ల‌మెంట్ భ‌వ‌నం ముందు ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు. ప్ల‌కార్డుల‌తో పాకిస్థాన్‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. పాక్ అకృత్యాల‌ను అడ్డుకోవాల‌న్నారు. బ‌లోచిస్తాన్‌కు విముక్తి క‌ల్పించాలంటూ డిమాండ్ చేశారు. బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ అధికారిక నివాసం ముందు ఫ్రీ బ‌లోచిస్తాన్ మూమెంట్ స‌భ్యులు ధ‌ర్నా చేప‌ట్టారు. అదృశ‌మ్య‌మైన బాధితుల అంత‌ర్జాతీయ దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు.

కెన‌డాలో కూడా పాక్‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రిగాయి. టొరంటోలో బ‌లోచ్‌, సింధి, ప‌స్తూన్లు ఆందోళ‌న చేప‌ట్టారు. అదృశ్య‌మ‌వుతున్న సంఘ‌ట‌న‌ల‌ను ఆపేవిధంగా పాక్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వారు డిమాండ్ చేశారు. ఇస్లాం మ‌తంలోకి బ‌ల‌వంత‌పు మార్పుడులు జ‌రుగుతున్నాయ‌ని, వాటిని నివారించాల‌న్నారు. న్యాయ‌విరుద్ధ‌మైన హ‌త్య‌ల‌ను అడ్డుకోవాల‌ని డిమాండ్ చేశారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/