అవసరమైతే జగన్‌ను కలుస్తా

ప్రభుత్వం కక్ష సాధింపులకు ప్రాధాన్యత ఇస్తోంది

balakrishna
balakrishna

హిందూపురం: టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ ఈరోజు హిందూపురం ప్రభుత్వాసుపత్రిని బాలయ్య సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి అవసరమైన రూ. 55 లక్షల విలువైన వైద్య పరికరాలను ఆయన అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..హిందూపురం అభివృద్ధి కోసం ఏం చేయడానికైనా తాను సిద్ధమేనని, ఈ విషయంలో అవసరమైతే సిఎం జగన్ ను కలవడానికి కూడా తాను సిద్ధమేనని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఓ మోస్తరు విమర్శలు చేశారు. అభివృద్ధి కంటే కూడా ఎక్కువగా కక్ష సాధింపులపైనే దృష్టి సారిస్తున్నారని అన్నారు. టిడిపి హయాంలో తెలంగాణ కంటే ఏపి ఆదాయం ఎక్కువగా ఉండేదని చెప్పారు. రాజకీయాలను పక్కన పెట్టి అందరూ కలసి పని చేస్తేనే రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తుందని అన్నారు. పార్టీలకు అతీతంగా అందరూ కలసి పని చేయాల్సి ఉందని చెప్పారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/