దేశాన్ని ఐక్యంగా ఉంచే పార్టీ కాంగ్రెస్సేః రేవంత్ రెడ్డి

తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి

Revanth Reddy who unveiled the statue model of Telangana mother

హైదరాబాద్ః దేశంతో పాటు తెలంగాణకు స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పెట్టిన కులాల కుంపటిని బిజెపి అందిపుచ్చుకుని మతాల మధ్య చిచ్చు పెడుతోందని విమర్శించారు. దేశాన్ని ఐక్యంగా ఉంచేది కాంగ్రెస్ పార్టీ అయితే… విభజన చేసేది బిజెపి అని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పేందుకే రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ విలీన వేడుకలు హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రేవంత్ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా జెండాను తయారు చేస్తామని చెప్పారు. తెలంగాణ సాయుధ పోరాటంలో నల్గొండ కీలక పాత్రను పోషించిందని అన్నారు. ఎందరో మహానుభావులు తమ వీరోచిత పోరాటాలతో పెత్తందారులను, భూస్వాములను తరిమికొట్టారని చెప్పారు. హైదరాబాద్ కు విమోచన కల్పించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ కు నివాళి అర్పించే నైతిక హక్కు బిజెపికి లేదని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/