జాన్సన్ బేబీ పౌడర్ లైసెన్స్‌ను రద్దుః మ‌హారాష్ట్ర

Maharashtra Cancels Johnson’s Baby Powder License, Firm Approaches Court

ముంబయిః జాన్స‌న్ అండ్ జాన్స‌న్ కంపెనీకి చెందిన బేబీ పౌడ‌ర్ ఉత్ప‌త్తి లైసెన్సును మ‌హారాష్ట్ర ఫుడ్ అండ్ డ్ర‌గ్స్ అడ్మినిస్ట్రేష‌న్ ర‌ద్దు చేసింది. ప్ర‌జా ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. జాన్స‌న్ బేబీ పౌడ‌ర్ వ‌ల్ల శిశువుల చ‌ర్మాల‌పై ఇన్‌ఫెక్ష‌న్ వ‌స్తున్న‌ట్లు ప్ర‌భుత్వ ఏజెన్సీ తెలిపింది. ల్యాబ‌రేట‌రీ ప‌రీక్ష స‌మ‌యంలో పౌడ‌ర్ పీహెచ్ విలువ స్టాండ‌ర్డ్‌గా లేద‌ని ఎఫ్‌డీఏ చెప్పింది. కోల్‌క‌తాకు చెందిన సెంట్ర‌ల్ డ్ర‌గ్స్ ల్యాబ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్ణ‌యం తీసుకున్న‌ది. పూణె, నాసిక్‌ల నుంచి పౌడ‌ర్ శ్యాంపిళ్ల‌ను సేక‌రించి మ‌హారాష్ట్ర‌లో ప‌రీక్ష‌లు చేశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/