రైతుబంధు ఫై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

రైతు బంధుపై సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. ట్యాక్స్‌ పేయర్స్‌కు రైతు భరోసా (రైతు బంధు) సాయాన్ని రద్దు చేయాలని అనుకుంటున్నామని.. అసెంబ్లీలో చర్చించి దీనిపై తుది నిర్ణయం ప్రకటిస్తామని అన్నారు. ఎవరైతే ప్రభుత్వానికి ఆదాయ పన్ను చెల్లిస్తున్నారో వారందరికీ ‘రైతు బంధు’ సాయాన్ని నిలిపివేయాలని భావిస్తున్నామని సూచనప్రాయంగా తెలిపారు. అసెంబ్లీలో ఈ విషయంపై విపులంగా చర్చించి తుది నిర్ణయం కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇసుక అమ్మకాల్లో ఆదాయం విపరీతంగా పెరిగిందని పేర్కొన్నారు. అదేవిధంగా జీఎస్టీ ఆదాయం కూడా రూ.500 కోట్లు పెరిగిందని తెలిపారు.

పార్లమెంట్ ఎన్నికలు మా పరిపాలనకు రెఫరెండం అని అన్నారు. తెలంగాణలో ప్రతిపక్ష నేత లేడని.. ఉంటే అసెంబ్లీకి వచ్చే వాడని మాజీ సీఎం కేసీఆర్ ను ఉద్దేశిస్తూ విమర్శలు చేశారు. బీఆర్ఎస్ తో బీఎస్పీ పొత్తు పెట్టుకోవడంపై సీఎం రేవంత్ స్పందించారు. RS ప్రవీణ్ కుమార్ తమకు మిత్రుడు కాదని తేల్చి చెప్పారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో రాహుల్‌ గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరుతున్నామని అన్నారు.