నిబంధనలు సడలిస్తే..మరింత మంది మరణించోచ్చు

ఆంక్షలు తొలగించకుంటే వ్యవస్థ అతలాకుతలం

mask factory- Trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఆరిజోనాలోని మాస్క్ లను తయారు చేసే కర్మాగారాన్ని సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ ను అడ్డుకునేందుకు ప్రకటించిన ఆంక్షలను తొలగించకుంటే, ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుందని, ఆర్థిక వ్యవస్థ కోసం నిబంధనలు సడలిస్తే, మరింత మంది మరణిస్తారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాస్క్ ధరించేందుకు కూడా నిరాకరించడం గమనార్హం. ఇక మాస్క్ లను తయారు చేసే పనిలో నిమగ్నమైన హనీవెల్ కార్మికులను, ఉద్యోగులను ట్రంప్ అభినందించారు. వారి కోసం తాను చీర్ లీడర్ గా మారతానని వ్యాఖ్యానించారు. అక్కడి ఉద్యోగులతో సమావేశమైన వేళ, అందరూ మాస్క్ లను ధరిస్తే, ట్రంప్ మాత్రం దానికి దూరంగా ఉన్నారు.

కాగా లాక్ డౌన్ నిబంధనలు ప్రారంభమైన తరువాత వైట్ హౌస్ ను దాటని ట్రంప్, తొలిసారిగా అధికారిక పర్యటనకు వచ్చిన వేళ, మాస్క్ తో కనిపిస్తారని అందరూ భావించారు. వైట్ హౌస్ వైద్యాధికారులు, తొలి మహిళ మెలానియా ట్రంప్ సైతం మాస్క్ లను ప్రమోట్ చేస్తున్న వేళ, ప్రజలంతా పాటిస్తున్న నియమాలను ట్రంప్ పక్కన పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/