భారీ వర్షాలు.. బొగత జలపాతం సందర్శన రద్దు

telangana-niagara-bogatha-waterfalls-site-visit-cancelled-with-heavy-rains

ములుగు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న తెలంగాణ నయాగరా బొగత జలపాతం ఉప్పొంగుతున్నది. మూడు రోజులుగా ఛత్తీస్‌గఢ్‌తోపాటు స్థానికంగా కురుస్తున్న వర్షాలకు జలకళ సంతరించుకున్నది. 50 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతూ పాలసంద్రంలా మారి కనువిందు చేస్తుండటంలో పెద్ద సంఖ్యలు పర్యాటకులు తరలివస్తున్నారు. అయితే భారీ వర్షాలు, వరద ఉధృతి పెరడటంతో జలపాతం సందర్శనను నిలిపివేస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. నేటి నుంచి బొగత సందర్శనకు అనుమతి లేదని ఎఫ్ఆర్వో చంద్రమౌళి తెలిపారు.