గట్టిగా వానోస్తే కూలిపోయే ఇంటికి రూ. 90 వేల కరెంట్ బిల్లు

గత కొద్దీ రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ బిల్లులు షాక్ కు గురి చేస్తున్నాయి. రీడింగ్ మేటర్లో సాంకేతిక లోపం కారణంగా వందల్లో వచ్చే కరెంట్ బిల్లు ఏకంగా లక్షలు , కోట్లలో వస్తున్నాయి. ఇదేంటి అని గట్టిగా అడిగితే బిల్లును సరి చేస్తున్నారు..లేదంటే కట్టాల్సిందే అని అధికారులు అంటున్నారు. తాజాగా ఓ నిరుపేద ఇంటికి ఏకంగా రూ.90 వేల కరెంట్ బిల్లు వచ్చి షాక్ ఇచ్చింది. ఆ ఇల్లు కూడా బాగాలేదు. గట్టిగా వానోస్తే కూలిపోయేలా ఉంది. అలాంటి ఇంటికి అంత బిల్లు వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే..

వైజాగ్ ఏజెన్సీ సీలేరు శివాలయం వీధిలో కిమ్ముడు స్వామినాథన్ నివాసం ఉంటున్నారు. ఆయన ఇంటికి సెప్టెంబర్ నెలకు గాను 90వేల నాలుగు వందల నాలుగు రూపాయలు కరెంట్ బిల్లు వచ్చింది. ఆ బిల్లు చూసి షాక్ కు గురైయ్యారు. తన ఇంట్లో ఉన్నవి రెండు ఫ్యాన్లు, మూడు బల్బులు, ఒక టీవీ. వీటికే అంత బిల్లు రావడంతో ఏం చేయాలో.. ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి తగు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నారు.