మా గ్యారంటీలను కేసీఆర్ కాపీ కొట్టిండు – రేవంత్ రెడ్డి

ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టో లను విడుదల చేస్తూ..ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ఈ తరుణంలో ఆదివారం బిఆర్ఎస్ అధినేత కేసీఆర్..తమ పార్టీ మేనిఫెస్టో ను విడుదల చేయగా..ఈ మేనిఫెస్టో ఫై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు.

”మమ్మల్ని కాపీ కొట్టి కేసీఆర్ పెద్ద గోతిలో పడ్డారు. మా ఆరు గ్యారంటీలను చూసి కేసీఆర్‌కు ఇన్నాళ్లూ చలిజ్వరం వచ్చింది. మా హామీలను అమలు చేయడం అసాధ్యమన్న బీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు వాళ్ల హామీలను ఎట్ల సమర్థించుకుంటారు? కాంగ్రెస్‌ను ప్రశ్నించే అర్హతను బీఆర్ఎస్ వాళ్లు కోల్పోయారు’ అని అన్నారు.

”మహాలక్ష్మి పథకం కింద మేం రూ.2,500 అంటే కేసీఆర్ రూ.3 వేలు ఇస్తామంటున్నారు. ఆడ బిడ్డలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తమని మేమంటే.. రూ.400కే ఇస్తమంటూ కేసీఆర్​ అన్నారు. పింఛన్లు మేం రూ.4 వేలు ఇస్తామంటే.. కేసీఆర్ రూ.5 వేలు అంటున్నారు. మేం ఇందిరమ్మ భరోసా కింద రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు రూ.15 వేలు ఇస్తామంటే.. ఆయన ఇప్పుడు రూ.16 వేలు ఇస్తామంటున్నారు. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అంటూ గతంలో సారా పాటలు నిర్వహిం చేవారు. కేసీఆర్ మాత్రం అట్లాంటి పాటలేవీ లేకుండానే కాంగ్రెస్​ను కాపీ కొట్టారు. రాష్ట్రం దివాలా తీయడమే కాకుండా.. కేసీఆర్ బుర్ర కూడా దివాలా తీసింది” అని విమర్శించారు.