ఏపి మరో 62 కరోనా పాజిటివ్‌ కేసులు

మొత్తం కరోనా కేసులు 2,514

corona virus
corona virus

అమరావతి: ఏపిలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 8,415 శాంపిళ్లను పరీక్షించగా మరో 62 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో 51 మంది డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 2,514 అని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 728 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,734 మంది డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ,కరోనా వల్ల మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మొత్తం 55కి చేరింది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/