అభివృద్ధిని చూసి బీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలి – హుస్నాబాద్‌ సభలో కేసీఆర్

తెలంగాణ ఎన్నికల ప్రచారాన్ని గులాబీ బాస్ కేసీఆర్ మొదలుపెట్టారు. గత ఎన్నికల్లో ఎలాగైతే హుస్నాబాద్‌ నుండి తన ప్రచారం మొదలుపెట్టి ఘన విజయం సాధించారో..ఇప్పుడు కూడా అదే రిపీట్ చేసారు. ఆదివారం హుస్నాబాద్‌ లో భారీ సభ ఏర్పాటు చేసి ప్రచారం మొదలుపెట్టారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి వొడితల సతీశ్‌కుమార్‌కు బీఫారం అందజేశారు. ‘సభ సాక్షి గా, మీ అందరి సాక్షిగా సతీశ్‌కు బీఫారం అందిస్తున్నాను. మీ బిడ్డగా దీవించండి’ అని ప్రజల ను కోరారు.

‘హుస్నాబాద్‌ గడ్డ ఆశీర్వాదంతో ఆనాడు నాలుగిం ట మూడు వంతులు.. అంటే 88 సీట్లతో అఖం డ విజయాన్ని సాధించినం. ఈసారి కూడా మళ్లీ హుస్నాబాద్‌ నుంచే జైత్రయాత్ర ప్రారంభించాలని పెద్దలు సూచించారు. అందుకే ఈ రోజు హైదరాబాద్‌లో అభ్యర్థులకు బీ ఫారాలు అందజేసి, మ్యానిఫెస్టో ప్రకటించి, మీ దర్శనానికి ఇక్కడికి వచ్చాను’ అని తెలిపారు.

‘ఎన్నికలు చాలా వస్తయి, చాలా పోతయి, ఎవరో ఒకరు గెలుస్తుంటరు. ఎన్నికలు రాంగనే ఆగమాగం కావొద్దు. రౌతేందో.. రత్నమేందో ఆలోచించాలె. మనకు పనికొచ్చేదేందో గుర్తు వ ట్టాలె’ అని అన్నారు. ఎవరో చెప్పారని ఓట్లు వేయొద్దని, ఓటు మన తలరాతను మారుస్తుందని అన్నారు. ‘ఎన్నికలు రాంగనే కొందరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతరు. అలవిగాని హామీలు ఇస్తరు. ఆపద మొక్కులు మొక్కుతరు. తీర్థం పోదాంపా తిమ్మక్క అంటే నేను గుళ్లె, నేను సల్లె అన్నట్టుగా.. యాడికి తీసుకపోతరో తెల్వదు’ అని కేసీఆర్‌ ఎద్దేవా చేశారు. కొన్ని పార్టీలు వచ్చి ఒక్క చాన్స్‌ ఇవ్వాలని అడుగుతున్నాయ ని మండిపడ్డారు. ‘ఒక్క చాన్స్‌ ఎందుకు నాయ నా ప్రజలు మీకు 10 చాన్సులు ఇచ్చారు కదా.. 60 ఏండ్లు మీరే రాజ్యం ఎలుగవెట్టిర్రు కదా. చేసిందేమిటి?’ అని ప్రశ్నించారు. 75 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో దళితులు ఇంకా పేదరికంలో మగ్గుతున్నారంటే అందరం బాధపడాలని, దేశం మొత్తం సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు.

గతంలో పింఛన్‌ రూ.40, రూ.70 చివరగా రూ.200 ఇచ్చారని కేసీఆర్‌ గుర్తు చేశారు. తాను సీఎం అయిన తర్వాత ‘ఎందుకు పెన్షన్‌ ఇవ్వాలి?. దానికి ఏమన్నా ప్రత్యేక కారణం ఉన్నదా? ఓట్ల కోసం మాత్రమే ఇస్తున్నామా?’ అని అధికారులను అడిగానని చెప్పారు. ఒకప్పుడు హుస్నాబాద్‌కు హెలికాప్టర్‌లో వస్తుంటే కండ్లల్లో నీళ్లు వచ్చేవని సీఎం కేసీఆర్‌ గుర్తు చేసుకున్నారు. తాను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కుండల్లో నీళ్లు తీసుకుపోయి తోట లో మొక్కలు కాపాడుకున్న ఘటనలను చూశానని చెప్పారు. ఇప్పుడు హెలికాప్టర్‌ నుంచి చూస్తే హుస్నాబాద్‌ వాగుమీద రెండుమూడు చెక్‌డ్యాంలు వరుసగా కనిపిస్తున్నాయని, రెం డిట్లో నీళ్లు ఉన్నాయని తెలిపారు. కనుచూపుమేర పచ్చని పంటపొలాలు దర్శనమిస్తున్నాయని అన్నారు.