కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సిఎం కేసీఆర్ భేటీ

న్యూఢిల్లీ : ఢిల్లీలో సిఎం కెసిఆర్ ప‌ర్య‌ట‌న కొన‌సాగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం కేసీఆర్ ఈరోజు మ‌ధ్యాహ్నం క‌లిశారు. ఈ స‌మావేశంలో అమిత్‌షాతో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల‌పై సీఎం చ‌ర్చించి, విన‌తిప‌త్రాలు స‌మ‌ర్పించ‌నున్నారు. ఐపీఎస్ క్యాడ‌ర్ రివ్యూ, విభ‌జ‌న చ‌ట్టం హామీల‌పై చ‌ర్చించే అవ‌కాశం ఉంది. మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణంపై చ‌ర్చించ‌నున్న‌ట్లు స‌మాచారం.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/international-news/