కోమటిరెడ్డి వ్యాఖ్యల ఫై రేవంత్ స్పందన

రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ అధికారాన్ని చేపట్టేంత మెజార్టీ రాదని , రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ రాబోతోందని… ఏ ఒక్క పార్టీకి 60 స్థానాలు వచ్చే అవకాశం లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని… మరొక పార్టీతో కలవాల్సిందేనని తెలిపారు. ప్రస్తుతం వెంకట్ రెడ్డి చేసిన కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ గా మారాయి. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై పలువురు బిజెపి నేతలు స్పందించగా..తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు.

కోమటిరెడ్డి ఏం మాట్లాడారో చూడలేదని, పార్టీకి నష్టం కలిగిస్తే అధిష్టానం చూసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కతో పాటు ఇన్చార్జి మాణిక్ రావు థాక్రె సైతం పెద్దగా స్పందించలేదు. అయితే పార్టీకి నష్టం కలిగితే చర్యలు తీసుకుంటుందని మాత్రం రేవంత్ రెడ్డి తెలుపడం జరిగింది. అలాగే మల్లు రవి మాత్రం కోమటిరెడ్డి వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు.
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో హంగ్ వస్తుంది అనడం హాస్యాస్పదం అన్నారు. కోమటిరెడ్డి పై చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి లేఖ రాస్తామన్నారు. కోమటిరెడ్డి కి గతంలో షోకాజ్ నోటీసులు ఇస్తే చెత్తబుట్టలో వేశారని చెప్పుకొచ్చారు.