ప్రేమికుల రోజున గుడ్ న్యూస్ తెలిపిన నటుడు నవీన్ చంద్ర

ఈరోజు ప్రేమికుల రోజు సందర్బంగా నటుడు నవీన్ చంద్ర తీపి కబురు తెలిపాడు. త్వరలోనే తాను తండ్రిగా ప్రమోషన్ పొందనున్నట్లు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. అంతేకాదు తనకు పుట్టబోయే బిడ్డకు స్వాగతం చెబుతూ భార్యతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానుల్లో సంతోషం నింపారు.

” బేబీ మూన్.. మా చేతుల్లోకి నిన్ను తీసుకోవడానికి చాలా ఆత్రుతగా వేచి చూస్తున్నాం. మేము తల్లిదండ్రులం కాబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కొత్త అధ్యాయం, కొత్త జీవితం, కొత్త ప్రయాణం. తండ్రిని కాబోతున్నాను. ఓర్మ ఐ లవ్ యు. హ్యాపీ వాలెంటైన్స్ డే” అంటూ తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఇక గతేడాది నవీన్ చంద్ర ..తన భార్య ఓర్మాను అభిమానులకు పరిచయం చేసిన విషయం తెలిసిందే. అందాల రాక్షసి మూవీ తో హీరోగా పరిచమైన నవీన్ చంద్ర, హీరోగానే కాక పలు విభిన్న పాత్రల్లో కూడా నటించి మెప్పించాడు. ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు చేస్తున్నాడు.