లేటు వయసులో జిగేల్ అనిపిస్తున్న కాజోల్

‘ దిల్వాలే దుల్హానియా లే జాయేంగే’ తో కుర్రకారు మనసులను కొల్లగొట్టిన బాలీవుడ్ సుందరి కాజోల్. కెరీర్ జెట్ స్పీడ్ లో ఉన్న సమయంలోనే నటుడు అజయ్ దేవగన్ ను 1999 ఫిబ్రవరి 24న వివాహం చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలున్నారు. ప్రస్తుతం కాజోల్ తనకు నచ్చిన పాత్ర దొరికితే దానికి ఓకే చెపుతుంది. ఈ మధ్యనే VIP 2 లో నెగిటివ్ షెడ్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. తాజాగా సలామ్ వెంకీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా డైరెక్ట్ గా ఒటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది.

తల్లి కొడుకుల మధ్య స్ట్రాంగ్ బాండింగ్ ని ఎస్టాబ్లిష్ చేసే కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది. ప్రస్తుతం మరో రెండు సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా కాజోల్ ఓ ఈవెంట్ లో పాల్గొన్న సందర్భంగా శారీలో జిగేల్ అనిపించింది. ఈ వయస్సులో కూడా స్టార్ హీరోయిన్స్ గా ఏ మాత్రం తీసిపోని అందంతో కాజోల్ మెరవడం విశేషం. ఈ లుక్ లో కాజోల్ ను చూసి అబ్బా అనుకుంటూ రొమాంటిక్ కామెంట్స్ చేస్తున్నారు.