టీ కాంగ్రెస్‌ బస్సు యాత్రలో పాల్గొనున్న రాహుల్ గాంధీ

Rahul Gandhi participating in T Congress Bus Yatra

హైదరాబాద్‌ః తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీలో ఉత్సాహం నింపేందుకు బస్సు యాత్రలకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 18 నుండి బస్సు యాత్రను చేపడుతోంది. ఇందులో రాహుల్ గాంధీ కూడా పాల్గొననున్నారు. ములుగు, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో మొత్తం 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో దాదాపు 190 కిలోమీటర్ల మేర మూడు రోజుల పాటు రాహుల్ బస్సు యాత్రలో పర్యటించనున్నట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు.

అయిదు జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలలో రాహుల్ ప్రసంగిస్తారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. అలాగే పాదయాత్ర చేస్తారని, వివిధ వర్గాల ప్రజలతో కూడా రాహుల్ గాంధీ మమేకమవుతారని పేర్కొన్నారు.