ఐఐటీ కాన్పూర్ 54వ స్నాతకోత్సవ వేడుకలో ప్రధాని ప్రసంగం

YouTube video
PM Narendra Modi attends the 54th Convocation Ceremony of IIT Kanpur

కాన్పూర్‌: ప్రధాని మోడీ ఈ రోజు ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో పర్యటిస్తున్నారు. కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 54వ (ఐఐటి కాన్పూర్) స్నాతకోత్సవంలో ప్రధాని మోడీ ప్రసంగించారు. రాబోయే యుగం విద్యార్థులకు సువర్ణవకాశమని ప్రధాని మోడీ పేర్కొ్న్నారు. భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద స్టార్టప్ హబ్‌గా అవతరించిందని.. ఈ ఘటన ప్రధానంగా ఐఐటీల నుంచి వచ్చిన విద్యార్థుల సహాయంతో సాధించినట్లు ప్రధాని మోడీ తెలిపారు. కాలేజీ నుంచి బయటకి అడుగు పెట్టగానే విద్యార్థులు విజయానికి షార్ట్‌కట్‌లతో ఆలోచిస్తారన్నారు.

చాలా మంది కంఫర్ట్ కోసం అన్వేషిస్తారని.. కంఫర్ట్ కంటే ఛాలెంజ్ ఎంచుకోవాలని సూచించారు. సవాళ్లను ఎదుర్కొని వాటిని సమర్ధవంతమైన పరిష్కారాలతో అధిగమించే వారే అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారన్నారు. నేడు మన చుట్టూ సాంకేతికత ఉన్నప్పటికీ.. మనం మానవులమని మరచిపోకూడదంటూ ప్రధాని మోడీ సూచించారు. మనకు మనం రోబో వెర్షన్‌లుగా మారకూడదని.. కృత్రిమ మేధస్సును అన్వేషించాలన్నారు. ఎప్పడూ మానవ మేధస్సును విస్మరించకూడదంటూ ప్రధాని మోడీ విద్యార్థులకు సూచించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/