బండ్ల గణేష్ ను అరెస్ట్ చేయకపోవడానికి కారణం వారేనా..?

బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కు ఒంగోలు కోర్ట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. కోర్ట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయలేకపోయారు. దీనికి కారణం ఏంటా అని అంత మాట్లాడుకుంటున్నారు. అయితే దానికి కారణం కొంతమంది ప్రజాపతినిధులే అని తెలుస్తుంది.
వివరాల్లోకి వెళ్తే..ముప్పాళ్లకు చెందిన జెట్టి జానకిరామయ్య వద్ద బండ్ల గణేష్ 2018లో రూ.95లక్షలు అప్పు తీసుకున్నారు. అందుకు సంబందించి పరమేశ్వరీ ఆర్ట్ ప్రొడక్షన్స్ పేరుతో అప్పట్లో చెక్కు ఇచ్చారు. ఆ తర్వాత జానకిరామయ్య మరణించారు. దీంతో ఆయన తండ్రి వెంకటేశ్వర్లు పలుమార్లు గణేష్‌ను డబ్బు అడిగారు. ఆయన స్పందించకపోవడంతో 2019 ఫిబ్రవరిలో వెంకటేశ్వర్లు కోర్టును ఆశ్రయించారు. విచారణకు హాజరుకావాలని కోర్టు గణేష్‌కు పలుసార్లు నోటీసులు ఇచ్చింది. అయితే అప్పటినుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా గణేష్ కోర్టుకు రాలేదు.
దీంతో ఈనెల 13న గణేష్‌కు కోర్టు అరెస్టు వారెంటు జారీచేసింది. దీంతో ఒంగోలు వన్‌టౌన్ పోలీసులు ఆయన్ను అరెస్టు చేసేందుకు హైదరాబాద్ వెళ్లారు. కానీ వారు గణేష్ ను అరెస్ట్ చేయలేకపోయారు. కొంతమంది ప్రజాప్రతినిధుల హామీ మేరకు పోలీసులు అరెస్టు చేయకుండా తప్పనిసరిగా సోమవారం కోర్టుకు హాజరుకావాల్సిందేనని చెప్పి వచ్చినట్లు తెలుస్తుంది. సోమవారం వ్వక్తిగతంగా ఒంగోలు రెండో మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో గణేష్ హాజరయ్యారు. దీంతో అరెస్టు వారెంటును రీకాల్ చేసిన న్యాయమూర్తి కేసును వ చ్చేనెల 9కి వాయిదా వేశారు. ఆలా గణేష్ అరెస్ట్ కాకుండా అయ్యిందని ప్రచారం జరుగుతుంది.