తెలంగాణలో నేడు, రేపు వర్షాలు

పశ్చిమ, వాయవ్య ప్రాంతం నుంచి తెలంగాణకు గాలులు

హైదరాబాద్: తెలంగాణలో నేడు, రేపు పలు చోట్ల ఓ మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్ నుంచి చత్తీస్‌గఢ్ వరకు 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడిందని, దీనికితోడు పశ్చిమ, వాయవ్య ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయని పేర్కొంది. వీటి ప్రభావంతో నేడు, రేపు అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక నిన్న ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య రాష్ట్రంలోని 133 ప్రాంతాల్లో ఓ మాదిరి వర్షాలు కురిసినట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/