సారవంతమైన భూములపై కేసీఆర్, కేసీఆర్ మాఫియా
ట్విట్టర్ వేదికగా టీఆర్ఎస్‌పై రేవంత్ రెడ్డి ఆరోపణలు

హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి టీఆర్ఎస్ పై విమర్శలు గుపించారు. వరంగల్ రింగు రోడ్డు (డబ్ల్యూఆర్ఆర్) పేరిట టీఆర్ఎస్ మరో లూటీకి తెర తీసిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. వరంగల్ రింగు రోడ్డు పేరిట వరంగల్ పరిధిలోని సారవంతమైన భూములను రైతుల నుంచి లాక్కునేందుకు ఇప్పటికే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు తమ రియల్ ఎస్టేట్ మాఫియాను రంగంలోకి దించారని కూడా రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇందులో భాగంగా ఇప్పటికే వందలు, వేల ఎకరాల భూములను రైతుల నుంచి అతి తక్కువ ధరకే తమ లాగేసుకున్నారని కూడా ఆయన ఆరోపించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా రేవంత్ రెడ్డి టీఆర్ఎస్‌పై కీలక ఆరోపణలు చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/