పోన్నాల రాజీనామా ఫై కాంగ్రెస్ పార్టీ స్పందన

తెలంగాణ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ కి పెద్ద షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య పార్టీ కి రాజీనామా చేసారు. బీసీలకు టికెట్లు ఇవ్వడం లేదనే కారణంతో పాటు పార్టీలో రెండేళ్లుగా తనను అవమానిస్తున్నారంటూ పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు పొన్నాల..బిఆర్ఎస్ లో చేరబోతున్నట్లు తెలుస్తుంది.

ఇక పొన్నాల రాజీనామా ఫై కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందిస్తున్నారు. పొన్నాల లక్ష్మయ్యకు అసలు సిగ్గుందా అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు. పొన్నాల కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేయడం పెద్ద తప్పు. ఆయన వయసుకు క్షమించరాని నేరం. బిఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీ నే బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించాము. చచ్చేముందు పార్టీ మారడానికి పొన్నాల లక్ష్మయ్యకు సిగ్గుండాలని.. పొన్నాల పార్టీ మారడంపై రేవంత్ రెడ్డి దురుసు వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ మాట్లాడుతూ అసీంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ అభ్యర్థులను 70 మందిని ఎంపిక చేశామన్నారు. ఈ జాబితా సిద్ధంగా ఉందన్నారు, కానీ ఇంకా మిగిలిన అభ్యర్థుల ఎంపికలో చాలా సవాళ్ళను ఎదుర్కొంటున్నామని మురళీధరన్ తెలియచేయడం విశేషం. ఆయా స్థానాలలో గెలుపు అవకాశాలు, విధేయత ఆధారంగా అభ్యర్థుల ఎంపికను చేస్తున్నామన్నారు. త్వరలోనే మిగిలిన అభ్యర్థుల ఎంపికపై చర్చించి పూర్తి జాబితాను ప్రకటిస్తామని మురళీధరన్ స్పష్టం చేశారు.