సిఎం జగన్ నెల్లూరు జిల్లా పర్యటన రద్దు

వర్షం కారణంగా సూళ్లూరుపేట నియోజకవర్గం పర్యటన రద్దు

CM Jagan

అమరావతిః సిఎం కెసిఆర్‌ నెల్లూరు జిల్లాలో మంగళవారం చేపట్టాల్సిన పర్యటన రద్దయింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సుమారు రూ.150 కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించి సూళ్లూరుపేట నియోజకవర్గంలో సీఎం పర్యటించాల్సి ఉంది. అయితే వర్షం ప్రభావంతో హెలికాఫ్టర్ ప్రయాణానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో సీఎం పర్యటనను రద్దు చేసినట్టు సమాచారం. కాగా సీఎం పర్యటన కోసం సూళ్లూరుపేటలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. సుమారు రూ.150 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు సంబంధించిన కార్యక్రమాలను రూపొందించారు.