జూన్ , జులై లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం – రేవంత్

వచ్చే ఏడాది జూన్ , జులై లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతామని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ‘‘నా లక్కీ నెంబర్ 9 .. అందుకే 99 సీట్లతో కాంగ్రెస్ కు అధికారం ఇవ్వాలని ప్రజలను కోరుతాం ’’ అని రేవంత్ అన్నారు. బీజేపీ , టీఆర్ఎస్ కంటే ఎక్కువ మందితో పరేడ్ గ్రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ సభను నిర్వహించి తీరుతామని ప్రకటించారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ బాధ్యతలు చేపట్టి నేటితో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా గాంధీభవన్‌లో పలు కార్యక్రమాలు చేపట్టారు.

ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ.. ‘‘ హుజూరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైతే నేను కుంగిపోయాను. ఆ దశలో నాకు కార్యకర్తలే అండగా నిలబడ్డారు’’ అని గుర్తు చేసుకున్నారు. కార్యకర్తలు నింపిన ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తామని, వచ్చే సంవత్సరం జూన్ , జులై లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని” తెలిపారు. సోనియా గాంధీ ఎవరు ముఖ్యమంత్రి అని చెబితే.. వాళ్లను పల్లకిలో మోసుకెళ్లి సీఎం కుర్చీలో కూర్చోబెడతామని రేవంత్ అన్నారు.

‘‘నా లక్కీ నెంబర్ 9 .. అందుకే 99 సీట్లతో కాంగ్రెస్ కు అధికారం ఇవ్వాలని ప్రజలను కోరుతాం ’’ అని చెప్పారు. బీజేపీ , టీఆర్ఎస్ కంటే ఎక్కువ మందితో పరేడ్ గ్రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ సభను నిర్వహించి తీరుతామని ఆయన చెప్పారు. 90 రోజుల్లో కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వం కార్యక్రమంలో 45 లక్షల మంది పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారని తెలిపారు.‘ సచివాలయమే లేదు. కానీ సీఎం కేసీఆర్ సచివాలయానికి ఎన్నిసార్లు వచ్చారు అనే సమాచారాన్ని ఆర్టీఐ ద్వారా బండి సంజయ్ అడుగుతున్నారు. కాళేశ్వరం , డబుల్ బెడ్ రూమ్స్ , కేసీఆర్ అవినీతిపై బండి సంజయ్ ఆర్టీఐ దరఖాస్తులు చేస్తే మంచిది’’ అని రేవంత్ కామెంట్ చేశారు.

2001లో కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఉపఎన్నిక వచ్చింది. అప్పుడు 90మంది ఎమ్మెల్యేలతో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రతిపక్షనేత, సీఎల్పీ నాయకుడిగా ఉండి ఉపఎన్నికను ఎదుర్కొన్నారు. సిద్దిపేట ఉపఎన్నికల్లో కేసీఆర్‌ గెలిస్తే.. వైఎస్‌ నిలబెట్టిన కాంగ్రెస్‌ అభ్యర్థి హన్మంత్‌రెడ్డికి 3,700 ఓట్లు వచ్చాయి. హుజూరాబాద్‌లో వచ్చిన ఎన్నికల ఫలితాలు మొదటి సారి వచ్చినవి కావు. గొప్ప నాయకుడు రాజశేఖర్‌రెడ్డి సీఎల్పీ నేతగా ఉన్నప్పుడు కూడా సిద్దిపేటలో అదే పరిస్థితి ఎదురైంది. అప్పుడు కూడా రాజశేఖర్‌రెడ్డి నాయకత్వం ఖతమై పోయింది. కాంగ్రెస్‌ పార్టీ నిండా మునిగిపోయిందన్నారు. కానీ, 2004లో రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర చేసి.. మహాకూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తే.. కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రతి ఓటమి ఒక గెలుపునకు పునాది అవుతుంది. హుజూరాబాద్‌ ఉపఎన్నిక కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలకు, నాకు ఒక అనుభవం అన్నారు. ఇక ఈరోజు రేవంత్‌ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌తో పాటు పలువురు నాయకులు కాంగ్రెస్‌లో చేరారు.