గుజరాత్ లో స్కూల్ బస్సు కు పెను ప్రమాదం తప్పింది

గుజరాత్ లో ఓ స్కూల్ బస్సు కు పెను ప్రమాదం తప్పింది. 35 మంది విద్యార్థులతో వెళ్తున్న బస్సు వరదలో చిక్కుకుంది. బస్సులో ఉన్న విద్యార్థులు పెద్దగా కేకలు వేయడం తో స్థానికులు అక్కడికి వచ్చి వారిని రక్షించారు. ఈ ఘటన జామ్ నగర్ జిల్లా కలవాడ్ లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే…

గురువారం ఉదయం జామ్ నగర్ జిల్లా కలవాడ్ లో స్టూడెంట్స్ ను ఎక్కించుకుని ఓ స్కూల్ బస్సు పాఠశాలకు వెళ్తుండగా ఉదయం 8 గంటల ప్రాంతంలో వరదలో చిక్కుంది. వరద తీవ్రత ఎక్కువగా ఉందని , బస్సును ముందుకు వెళ్లోద్దని చెప్పినప్పటికీ డ్రైవర్ ఏమాత్రం వినకుండా అలాగే ముందుకు వెళ్ళాడు. దీంతో బస్సు వరద ప్రవాహంలో చిక్కుకొని బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో ఉన్న విద్యార్థులు పెద్దగా కేకలు వేశారు. వెంటనే స్పందించిన స్థానికులు తాళ్ల సాయంతో వారిని రక్షించారు. అధికారులు వెంటనే స్పందించడంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. జేసీబీకి తాళ్లు కట్టివారిని క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. తమ పిల్లలు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడటంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. సకాలంలో స్పందించిన స్థానికులు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.