కెసిఆర్‌ నేతృత్వంలోనే సమస్త వృత్తులకు గుర్తింపు

Talasani Srivinivasa yadav
Talasani Srivinivasa yadav

నల్గొండ: పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పర్యటించారు. కొత్తపల్లి గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్యతో కలిసి పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించి మొక్కలు నాటారు. అనంతరం తిరుమలగిరిసాగర్ మండల కేంద్రంలోని పెద్ద చెరువులో చేప పిల్లలను వదిలారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్స్యకారుల జీవితాల్లో చేప పిల్లల పంపిణీ సమూల మార్పులు తీసుకువస్తుందని చెప్పారు. కెసిఆర్‌ నేతృత్వంలోనే సమస్త వృత్తులకు గుర్తింపు లభించిందన్నారు. అన్ని వృతులకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానిదే అన్నారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరంట్, పుష్కలంగా నీళ్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి పేర్కొన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/