జాతి ఐక్య‌త‌కు అంద‌రూ సహకరించాలి

మ‌నిషి చ‌ర్మ‌రంగు ఆధారంగా జాతివివ‌క్ష ఆరోప‌ణ‌లు చేయ‌లేం

melania-trump

వాషింగ్టన్‌: వైట్‌హౌజ్ నుంచి వ‌ర్చువ‌ల్‌గా రిపబ్లిక‌న్ పార్టీ స‌మావేశంలో అమెరికా ఫ‌స్ట్ లేడీ మెలానియా ట్రంప్ కీల‌క ఉప‌న్యాసం చేశారు. జాతి ఐక్య‌త‌కు అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని ఆమె కోరారు. హింస‌ను, లూటీల‌ను ఆపాలంటూ ఆమె పిలుపునిచ్చారు. జాతి ఆధారంగా జ‌రుగుతున్న త‌ప్పుడు ఆలోచ‌న‌ల‌ను ప‌క్క‌న‌పెట్టాల‌ని, అమెరికా చ‌రిత్ర‌పై విశ్వ‌స‌నీయ‌త‌ను నిలుపుకోవాల‌ని ఆమె అన్నారు. మీ అంద‌రి త‌ర‌హాలోనే.. నేను కూడా జాతివివ‌క్ష సంఘ‌ట‌న‌ల‌పై స్పందించాన‌ని అన్నారు. దేశ చ‌రిత్ర‌లో జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌ల ప‌ట్ల మ‌నం గ‌ర్వంగా ఫీల్ కాలేమ‌ని, గ‌తం నుంచి పాఠాల‌ను నేర్చుకుంటూనే.. భ‌విష్య‌త్తుపై మీరంతా దృష్టిపెట్టాల‌ని మెలానియా త‌న ప్ర‌సంగంలో కోరారు. సామ‌ర‌స్య‌పూర్వ‌కంగా మ‌నం అంతా ఒక్క‌టి కావాల‌ని ఆమె ప్ర‌జ‌ల్ని అభ్య‌ర్థించారు. అలా చేస్తేనే అమెరికా విలువల‌కు, ప్ర‌మాణాల‌కు త‌గిన‌ట్లు జీవించ‌గ‌ల‌మ‌న్నారు. న్యాయం పేరుతో జ‌రుగుతున్న హింస‌ను, లూటీల‌ను ఆపాల‌ని ఆమె కోరారు. మ‌నిషి చ‌ర్మ‌రంగు ఆధారంగా జాతివివ‌క్ష ఆరోప‌ణ‌లు చేయ‌లేమ‌న్నారు.


తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/