నెగెటివ్ షేడ్స్ రోల్స్ !

అలనాటి అందాల తార మీనా కోరిక

Senior Actress Meena

 సీనియర్ హీరోయిన్ మీనా వెబ్ వరల్డ్ లో కూడా అడుగులు వేశారు. జీ5 ఒరిగినల్స్ లో ప్రసారమైన ‘కరోలిన్ కామాక్షి’ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను ఎంటర్టెన్ చేసింది.

ఈ క్రమంలో విలన్ రోల్స్ చేయడానికి కూడా సిద్ధమే అంటోంది ఈ సీనియర్ నటి.

ఇటీవల మీనా నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ దొరికితే చేయాలని ఉందని తన కోరికను వెలిబుచ్చింది.

ఇప్పటికే సీనియర్ హీరోయిన్స్ రమ్యకృష్ణ – సిమ్రాన్ లాంటి వారు ప్రతినాయకి ఛాయలున్న పాత్రల్లో నటించి సక్సెస్ అయ్యారు.

నేటి తరం హీరోయిన్స్ లో కూడా త్రిష – వరలక్ష్మి శరత్ కుమార్ లాంటి వారు నెగిటివ్ రోల్స్ చేయడానికి ముందుకొస్తున్నారు.

ఈ క్రమంలో ఇప్పుడు అలనాటి అందాల తార మీనా కూడా నెగిటివ్ క్యారెక్టర్స్ చేయడానికి రెడీ అంటోంది. మరి ఈ సీనియర్ హీరోయిన్ కోరిక నెరవేరుతుందేమో చూడాలి.

ఇకపోతే మీనా ప్రస్తుతం మలయాళంలో ‘దృశ్యం-2’ మరియు తమిళ్ లో రజినీకాంత్ సరసన ‘అన్నాత్తే’ చిత్రాల్లో నటిస్తోంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/