బహుముఖ ప్రతిభాశాలి శీలా వీర్రాజు కన్నుమూత

కథ రచయిత, నవలారుడు, చిత్రకారుడు, కవి అయిన శీలా వీర్రాజు కన్నుమూశారు. ఈరోజు బుధువారం హైదరాబాద్ లోని ఆయన స్వగ్రామంలో తుది శ్వాస విడిచారు. శీలా వీర్రాజు 1939, ఏప్రిల్ 22న రాజమండ్రిలో జన్మించాడు. విద్యాభ్యాసం కూడా రాజమండ్రిలోనే జరిగింది.1961లో హైదరాబాదు నుండి వెలువడే కృష్ణాపత్రికలో సబ్ ఎడిటర్‌గా చేరి రెండేళ్లు పనిచేశాడు. 1963లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ సమాచార పౌర సంబంధ శాఖలో అనువాదకుడిగా చేరి 1900లో స్వచ్ఛంద పదవీవిరమణ చేశాడు. చిత్రకారుడిగా, కవిగా, కథారచయితగా, నవలారచయితగా బహుముఖ ప్రతిభను ప్రదర్శించాడు.

కళాశాల విద్య అభ్యసించే సమయంలోనే కథలు రాయడం ప్రారంభించారు. సాహితీ మిత్రులు ఆయనను శీలావీగా పిలుచుకుంటారు. సమాధి, మబ్బు తెరలు, వీర్రాజు కథలు, హ్లాదిని, రంగుటద్దాలు, పగా మైనస్ ద్వేషం, వాళ్ల మధ్య వంతెన, మనసులోని కుంచె, ఊరు వీడ్కోలు చెప్పింది, శీలా వీర్రాజు కథలు అనే కథాసంపుటులను వెలువరించారు. వెలుగురేఖలు, కాంతిపూలు, కరుణించని దేవత, మైనా అనే నవలలను ఆయన రాశారు. కొడిగట్టిన సూర్యుడు, హ్రుదయం దొరికింది, మళ్లీ వెలుగు (దీర్ఘ కావ్యం), కిటికీకన్ను, ఎర్రడబ్బా రైలు, పడుగు పేకల మధ్య జీవితం, శీలా వీర్రాజు, బతుకుబాస (నవలా కథకావ్యం) కవితాసంపుటులను వెలువరించారు. కలానికి ఇటూ అటూ అనే వ్యాససంపుటిని కూడా వెలువరించారు.