పవన్ హెచ్చరించాడు..జగన్ పని మొదలుపెట్టాడు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించేసరికి..వైస్సార్సీపీ పని మొదలుపెట్టింది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాలో వారాహి విజయ యాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఈ యాత్ర కు ప్రజలు బ్రహ్మ రథంపట్టారు. అడుగడుగునా పవన్ అధికార పార్టీ వైస్సార్సీపీ ఫై నిప్పులు చెరుగుతూ..జనసేన అధికారంలోకి వస్తే ఏంచేస్తుందో తెలుపుతూ వచ్చారు.

జూన్ 25 న రాజోలు నియోజకవర్గంలోని మలికిపురంలో భారీ సభ నిర్వహించారు. ఆ సభలో పవన్ కళ్యాణ్.. వైఎస్సార్‌సీపీ నేతలు, ప్రభుత్వానికి చెబుతున్నాను అంటూ ఓ అల్టిమేటం జారీ చేశారు. 15 రోజులు సమయం ఇస్తున్నా.. ఆ లోపు రాజోలు బైపాస్‌ రోడ్డు వేయకపోతే.. తామే శ్రమదానం చేసి, తానే ముందుండి రోడ్డు వేసేస్తాను హెచ్చరించారు. పవన్ హెచ్చరించిన ఐదు రోజుల్లోనే ప్రభుత్వం రోడ్డు పనులు మొదలుపెట్టింది.

ఈ రోడ్డు అభివృద్ధికి మూడు నెలల క్రితమే రూ.90 లక్షలతో ప్రతిపాదనలు చేశామని.. నిధులు మంజూరు కావాల్సి ఉందని ఆర్‌అండ్‌బీ జేఈ సురేష్‌ అన్నారు. నిర్వహణ నిధులతో ఈలోపు ప్రయాణాలకు ఇబ్బంది లేకుండా మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు. నిధులు మంజూరైన వెంటనే సీసీ రహదారి నిర్మిస్తామని తెలిపారు. పవన్‌కళ్యాణ్ సభలో ప్రభుత్వాన్ని హెచ్చరించిన తర్వాత రోడ్డు పనులు ప్రారంభం కావడంతో.. జనసైనికులు ఈ క్రెడిట్‌ తమ అధినేతకే దక్కుతుంది చెపుతున్నారు.