లలిత జ్యూయలర్స్ రూ.కోటి విరాళం
సిఎంకు చెక్కు అందజేసిన సిఎండి

ముఖ్యాంశాలు
- కోవిడ్-19 నివారణ సహాయక చర్యలకు చేయూత
- లలిత జ్యూయలరీ మార్ట్ ప్రై.లి. రూ.కోటి విరాళం
- సంస్థ సిఎండి డాక్టర్ ఎం.కిరణ్‌కుమార్‌కు ముఖ్యమంత్రి అభినందన
Amaravati: రాష్ట్రంలో కోవిడ్-19 నివారణ సహాయక చర్యలకు చేయూతగా లలిత జ్యూయలరీ మార్ట్ ప్రై.లి. రూ.కోటి విరాళం అందజేసింది.
బుధవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సిఎం సహాయనిధికి గానూరూ.కోటి చెక్కును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి ఆ సంస్థ సిఎండి డాక్టర్ ఎం.కిరణ్‌కుమార్ అందజేశారు.
ఈసందర్భంగా కిరణ్‌కుమార్‌ను సిఎం అభినందించారు.