ఉక్రెయిన్ లో మరో భారతీయ విద్యార్థి మృతి

భారతీయ విదేశాంగ శాఖ ధృవీకరణ

Chandan Jindal from Punjab
Chandan Jindal -File

ఉక్రెయిన్ దేశం లో మరో భారతీయ విద్యార్థి మృతి చెందాడు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన చందన్ జిందాల్ (22) అనే విద్యార్థ ఉక్రెయిన్ లో మృతి చెందినట్లు సమాచారం. జిందాల్ ఇస్కీమిక్ స్ట్రోక్‌ అనే వ్యాధి కారణంగా మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ విషయాన్ని కొద్దీ సేపటి క్రితం భారతీయ విదేశాంగ శాఖ ధృవీకరించింది. ఉక్రెయిన్‌లోని విన్నిట్సియా నేషనల్ పైరోగోవ్ మెమోరియల్ మెడికల్ యూనివర్సిటీలో మెడికల్ విద్యను అభ్యసిస్తున్నాడు జిందాల్. అనారోగ్యంగా కారణంగా విన్నిట్సియాలోని అత్యవసర ఆసుపత్రిలో చేరాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.

తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/