గుజరాత్‌ ఎన్నికలు.. రివాబా జడేజా విజయం

Ravindra Jadeja’s wife Rivaba Jadeja wins from Jamnagar North seat

అహ్మాదాబాద్ః గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బిజెపి టికెట్‌పై నార్త్‌ జామ్‌నగర్‌ నుంచి పోటీ చేసిన క్రికెటర్‌ రవీంద్ర జడేజా భార్య రివాబా విజయం సాధించారు. సమీప అభ్యర్థిపై 61,065 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.ఈ సందర్భంగా రివాబా మాట్లాడుతూ.. ‘నాకు అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన బిజెపితో పాటు.. నా కోసం ప్రచారంలో పనిచేసిన కార్యకర్తలకు.. నాకు ఓటు వేసిన ప్రజలకు ధన్యవాదాలు. ఇది నా విజయం మాత్రమే కాదు.. ప్రజలందరి విజయం’ అంటూ తన విజయంపట్ల సంతోషం వ్యక్తం చేశారు.

కాగా, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి అధికార బిజెపి అత్యధిక స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. మొత్తం 182 స్థానాలకుగాను ఇప్పటి వరకు 103 స్థానాల్లో బిజెపి అభ్యర్థులు విజయం సాధించగా.. మరో 51 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/international-news/