రిమాండ్ కు చంద్రబాబు

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయినా మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు కు 14 రోజుల రిమాండ్ విధించింది ఏసీబీ కోర్ట్. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని పోలీసులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన విషయం తెలిసిందే. చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించగా, సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.

తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని టీడీపీ భావించగా..కోర్ట్ మాత్రం ఏసీబీ కే మద్దతు తెలుపుతూ తీర్పు ఇచ్చింది. చంద్రబాబుకు 14 రోజులు రిమాండ్‌ విధిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. నేరపూరిత కుట్రకు చంద్రబాబు పాల్పడ్డారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి. 409 సెక్షన్ వర్తిస్తుంది. 14 రోజుల రిమాండ్‌ విధిస్తున్నామని న్యాయమూర్తి అన్నారు. చంద్రబాబు రిమాండ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు 144 సెక్షన్ విధించారు. ప్రస్తుతం చంద్రబాబు సిట్ ఆఫీస్ కు తరలించారు. రేపు రాజమండ్రి సెంట్రల్ జైలు కు తరలించనున్నారు.