అవతార్ 2 ట్రైలర్ రిలీజ్

హాలీవుడ్‌ డైరెక్టర్‌ జేమ్స్‌ కామెరూన్‌ అద్భుత సృష్టి అవతార్‌ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవతార్‌ సినిమా ఏ రేంజ్‌లో రికార్డులు సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. చిన్న,పెద్ద అనే తేడా లేకుండా అందరినీ కొత్త లోకంలో విహరింపజేసిన అవతార్‌ సినిమా సీక్వెల్స్‌తో మరోమారు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

‘అవతార్’ సినిమాకి కొనసాగింపుగా మరో నాలుగు సినిమాలు చేస్తున్నారు దర్శకుడు జేమ్స్ కామెరూన్. ఇందులో భాగంగా ముందుగా ”అవతార్: ది వే ఆఫ్ వాటర్” ని రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మోస్ట్ ఎవైటెడ్ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ అనూహ్య రెస్పాన్స్ తెచ్చుకోగా.. తాజాగా మరో కొత్త ట్రైలర్ ని సోషల్ మీడియా వేదికగా ఆవిష్కరించారు.

‘అవతార్’ సినిమాతో ప్రేక్షకుల్ని పాండోరా గ్రహంలో విహరింపజేసిన జేమ్స్ కామెరూన్.. ఇప్పుడు ”అవతార్ 2” లో సముద్ర గర్భంలోని తీసుకెళ్లి మరో సరికొత్త ఊహా లోకాన్ని పరిచయం చేశారు. సముద్రంపై అవతార్స్ చేస్తున్న విన్యాసాలు మరియు అబ్బురపరిచే గ్రాఫిక్స్ కనువిందు చేస్తున్నాయి. లైట్ స్ట్రామ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌-టీఎస్‌జీ ఎంటర్‌టైన్‌మెంట్ పై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రధాన భారతీయ భాషలన్నింటిలో విడుదల చేస్తున్నారు. డిసెంబర్‌ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయబోతుంది.

YouTube video