మూడు రాజధానుల నిర్ణయం బోగస్‌ విధానం

రాజధాని విషయంలో ఏపీకి కేంద్రం ఎలాంటి అనుమతి ఇవ్వలేదు అవన్నీ కల్పితాలే

G. V. L. Narasimha Rao
G. V. L. Narasimha Rao

న్యూఢిల్లీ: మూడు రాజధానుల నిర్ణయం బోగస్‌ విధానమని బిజెపి ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు అన్నారు. రాజధాని విషయంలో ఏపీకి కేంద్రం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని..కేంద్రం అనుమతితోనే అంతా జరుగుతోందని వస్తున్న కథనాలు కల్పితాలేనని జీవీఎల్‌ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని ఎక్కడ ఉండాలనే అంశం పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమని జీవీఎల్‌ స్పష్టం చేశారు. కాగా అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగితే ప్రభుత్వం ఎందుకు కేసులో పెట్టలేదని..అక్రమార్కులను వైఎస్సాఆర్‌సిపి ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తోందా అని జీవీఎల్‌ ప్రశ్నించారు. కాగా మరోవైపు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలి అంటున్నారని..తమ నిస్సహయతను టిడిపి కేంద్రంపై రుద్దాలని చూస్తోందా అని జీవీఎల్‌ మండిపడ్డారు. నాలుగు ఏళ్లలో చంద్రబాబునాయుడు నాలుగు శాశ్వత భవనాలు కట్టలేకపోయారని జీవీఎల్‌ ధ్వజమెత్తారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/