రవితేజ కు మంచు మనోజ్ విలన్..?

రెండు రోజులుగా సోషల్ మీడియా లో దీని గురించే మాట్లాడుకుంటున్నారు. రవితేజ – విశ్వక్ సేన్ హీరోలుగా కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ డైరెక్షన్లో ఓ సినిమా తెరకెక్కబోతుందని..ఈ సినిమా ను బేబీ నిర్మాత SKN నిర్మించబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ భారీ మల్టీస్టారర్ చిత్రంలో విలన్ గా మంచు మనోజ్ నటించబోతున్నట్లు అంటున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్‌ను తెరపైకి తీసుకురావడానికి ఆయన చాలా కష్టపడుతున్నారట. ఎంతో కష్టపడి ఈ ముగ్గురు హీరోలను ఒప్పించారని అంటున్నారు.

అక్టోబర్‌లో ఈ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ కాంబినేషన్ కానీ నిజంగానే సెట్ అయితే వెండితెర మీద మోత మోగిపోవడం ఖాయం. అందులోనూ మంచు మనోజ్ విలన్‌గా కచ్చితంగా బాగుంటారు. రవితేజతో పోటీ పడే సత్తా ఆయన సొంతం. ఇక విశ్వక్ సేన్ ఎనర్జీ మూవీకి ఉపయోగపడుతుంది. అయితే, ‘కలర్ ఫోటో’ లాంటి ఒక సున్నితమైన ప్రేమకథను తెరకెక్కించిన సందీప్ రాజ్.. ఇలాంటి మాస్ హీరోల కోసం ఎలాంటి కథ సిద్ధం చేశారు అనేది ఆసక్తికరం. ‘బేబి’తో ఎవ్వరూ ఊహించని విజయాన్ని అందుకున్న ఎస్కేఎన్.. ఒకవేళ ఈ సినిమాను నిర్మించి హిట్ కొడితే ఇక ఆయనకు తిరుగుండదు. చూద్దాం.. ఇవన్నీ జరుగుతాయో లేదో.