కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బిఆర్ఎస్‌కు వేసినట్లేః ఈటల

కెసిఆర్ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు కూడా మాట్లాడే అవకాశం లేదని విమర్శలు

etela-rajender-election-campaign-in-nagarkurnool

హైదరారబరాద్‌ః కెసిఆర్‌కు మళ్లీ అవకాశం ఇస్తే ఎప్పటిలాగే ప్రగతి భవన్, ఫామ్ హౌస్‌కే పరిమితమవుతారని బిజెపి నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బిఆర్ఎస్‌కు వేసినట్లే అన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేసి వృథా చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులకు కూడా మాట్లాడే అవకాశం లేదన్నారు. దళిత ముఖ్యమంత్రి, రేషన్ కార్డులు, దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం అని చెప్పిన ముఖ్యమంత్రి ఏ హామీలనూ నెరవేర్చలేదన్నారు.