హీరో నిఖిల్ ఇంట తీవ్ర విషాదం..

Nikhil’s Father passed away

హ్యాపీ డేస్ ఫేమ్ హీరో నిఖిల్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. నిఖిల్ తండ్రి కావలి శ్యామ్ సిద్ధార్థ్ ఈరోజు ( గురువారం) తుదిశ్వాస విడిచారు. గత కొద్దీ రోజులుగా అనారోగ్యం బారినపడినన శ్యామ్ సిద్ధార్థ్ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దీ సేపటి క్రితం కన్నుమూశారు. తండ్రి మరణంతో నిఖిల్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇక శ్యామ్ సిద్ధార్థ్ మరణ వార్త తెలుసుకున్న పరిశ్రమ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. శ్యాం సిద్ధార్థ్ ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా ద్వారా సినీ ప్రముఖులు , నటి నటులు , అభిమానులు కోరుకుంటున్నారు. కాగా 2007 లో వచ్చిన హ్యాపీ డేస్ సినిమా తో తెలుగు పరిశ్రమకి పరిచమైన నిఖిల్..తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. విభిన్న కథలతో మెప్పిస్తూ వస్తున్నాడు. త్వరలో 18 పేజెస్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నిఖిల్ తండ్రి పేరు శ్యామ్ సిద్ధార్థ, తల్లి వీనా సిద్ధార్థ, శ్యామ్ సిద్ధార్థ కి ఇద్దరు కుమారులు (నిఖిల్, రోహిత్) ఒక కూతురు ( సోనాలి) ఉన్నారు.