రవితేజ ‘రావణాసుర’ నుండి ‘వెయ్యినొక్క జిల్లాల’ సాంగ్ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న రావణాసుర నుండి మూడో సాంగ్ ‘వెయ్యినొక్క జిల్లాల’ వచ్చేసింది. ధమాకా , వాల్తేర్ వీరయ్య చిత్రాలతో మెగా హిట్స్ అందుకున్న మాస్ రాజా రవితేజ..ప్రస్తుతం రావణాసుర మూవీ తో ఏప్రిల్ 07 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ డైరెక్షన్లో.. నావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ లో రవితేజ సరసన ఏకంగా 5 గురు హీరోయిన్లు నటిస్తున్నారు. అనూ ఇమ్మాన్యూయేల్, మేఘా ఆకాష్, ఫరీయా అబ్దుల్లా, దీక్షా నగార్కర్, పూజిత పొన్నాడ నటించారు.

ఇప్పటికే ఈ సినిమా తాలూకా టీజర్ , ట్రైలర్ , సాంగ్స్ సినిమా ఫై ఆసక్తి పెంచగా..తాజాగా చిత్రంలోని మూడో సాంగ్ ‘వెయ్యినొక్క జిల్లాల వరకూ వింటున్నాము నీ కీర్తినే .. ‘ ను రిలీజ్ చేసారు. 1991లో వెంకటేశ్ హీరోగా వచ్చిన ‘సూర్య ఐపీఎస్’ సినిమాలోని పాటకు ఇది రీమిక్స్. సిరివెన్నెల రాసిన ఆ పాటకు అప్పట్లో ఇళయరాజా సంగీతాన్ని అందించారు. ఇప్పుడు ఆ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. అభిషేక్ నామా నిర్మించిన ఈ సినిమాకి రవితేజ నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ – భీమ్స్ సంగీత దర్శకులుగా వ్యవహరించారు.

YouTube video