ఉస్మానియా యూనివర్సిటీ వద్ద టెన్షన్ వాతావరణం..రేవంత్ హౌస్ అరెస్ట్

ఉస్మానియా యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈరోజు (మార్చి 24 ) విద్యార్థులు నిరుద్యోగ మార్చ్‌, నిరసన దీక్షకు పిలుపునివ్వడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు , పలు విద్యార్థి సంఘాలు ఓయూ కు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా విద్యార్థి సంఘాల నేతలను అరెస్టు చేస్తున్నారు. మరోపక్క టీపీసీసీ చీఫ్ రేవంత్ ను సైతం పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. నిరుద్యోగ మార్చ్‌ కు ముఖ్య అతిధిగా రేవంత్ ను ఆహ్వానించినా నేపథ్యంలో పోలీసులు అయ్యాను హౌస్ అరెస్ట్ చేసారు.

ఓయూకి వెళ్లి తీరతానని రేవంత్ చెబుతున్నారు. దీక్ష జరిగి తీరుతుందని ఓయూ విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. ఓయూకు వస్తే రేవంత్‌ను అడ్డుకుని తీరుతామని బీఆర్ఎస్వీ హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో రేవంత్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించి , . రేవంత్ ఇంటికి వెళ్లే దారులన్నీ మూసేశారు. రేవంత్ ఇంటికి ఎవరూ రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.