రవితేజ ‘రావణాసుర’ మూవీ టాక్..

మాస్ రాజా రవితేజ హీరోగా సుధీర్ వర్మ డైరెక్షన్లో అభిషేక్ పిక్చ‌ర్స్, ఆర్‌టీ టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై తెరకెక్కిన మూవీ రావణాసుర. ఈ మూవీ లో రవితేజ సరసన ఏకంగా 5 గురు హీరోయిన్లు నటించారు. అనూ ఇమ్మాన్యూయేల్, మేఘా ఆకాష్, ఫరీయా అబ్దుల్లా, దీక్షా నగార్కర్, పూజిత పొన్నాడ నటించారు. ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ – భీమ్స్ సంగీత దర్శకులుగా వ్యవహరించారు. ఢంకా , వాల్తేర్ వీరయ్య మూవీస్ తో సూపర్ హిట్స్ అందుకున్న రవితేజ..రావణాసుర తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నట్లే అని అభిమానులు అంటున్నారు. భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ని చూసిన అభిమానులు , సినీ లవర్స్ సినిమా ఎలా ఉందనేది సోషల్ మీడియా ద్వారా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఈ చిత్రంలో ఫస్ట్ టైం ర‌వితేజ క్రిమిన‌ల్ లాయ‌ర్ పాత్ర‌లో కనిపించి అదరగొట్టాడని అంటున్నారు. క్లైమాక్స్‌లో బీజీఎం సూపర్బ్ గా ఉందని , క్లైమాక్స్ అదిరిపోయిందని , లాయర్ క్రిమినల్ అయితే ఎలా ఉంటుందో మన మాస్ మహారాజా చూపించాడు అని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ డీసెంట్‌గా ఉంది. ఇంటర్వెల్ బ్యాంగ్ మైండ్ బ్లోయింగ్. సెకండ్ హాఫ్ సూపర్. హీరోయిన్స్ రోల్స్ ఇంప్రెసివ్ గా లేవు. రవితేజ నటనతో రావణాసుర బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిందని చెపుతున్నారు. ఓవరాల్ గా ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు సినిమాకు హిట్ టాక్ వస్తుంది. రవితేజ ఖాతాలో మరో హిట్ పడ్డట్లే అంటున్నారు.