వాహనాల రిజిస్ట్రేషన్స్ కుంభకోణంలో జెసి ప్రభాకరరెడ్డి అరెస్ట్
జేసీ ట్రావెల్స్‌పై మొత్తం 24 కేసులు

Anantapur: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్‌లోని నివాసంలో శనివారం ఉదయం కుమారుడు అస్మిత్ రెడ్డిని కూడా అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..
అనంతరం వారిని అనంతపురం కు తరలించారు. బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా రిజిస్ట్రేషన్ చేసి అమ్మకాలు సాగించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
154 బస్సులు నకిలీ ఎన్ ఓ సి , ఫేక్ ఇన్స్యూరెన్స్ కేసులో వారిని అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. ఇప్పటివరకు 154 వాహనాలను నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్ చేయించినట్లుగా వారు గుర్తించారు.
నకిలీ రిజిస్ట్రేషన్లకు సంబంధించి జేసీ ట్రావెల్స్‌పై మొత్తం 24 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, తాడిపత్రి పోలీసు స్టేషన్లలో జేసీ ట్రావెల్స్‌పై ఇప్పటివరకు 27 కేసులు ఉన్నాయి.
ఈ వాహనాలు ఏపీ, నాగాలాండ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్నాయని.. ఒకే నకిలీ ఇన్స్యూరెన్స్ పాలసీని నాలుగైదు వాహనాలకు చూపినట్లు రవాణాశాఖ గుర్తించింది.
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/