ఇవాళ రాష్ట్రపతి భవన్‌లో లాంఛన స్వాగత కార్యక్రమం

New Delhi: భారత్‌లో రెండు రోజుల పర్యటనకు వచ్చిన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ కు ఇవాళ ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో లాంఛన స్వాగత కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 10.30 గంటలకు ట్రంప్ రాజ్‌ఘాట్‌ను సందర్శించి జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులర్పించనున్నారు.
ఉదయం 11 గంటలకు ఢిల్లిలోని హైదరాబాద్ హౌస్‌లో మోడీతో ట్రంప్ భేటీ కానున్నారు. ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు.
మధ్యాహ్నం 12.40 గంటలకు ద్వైపాక్షిక ఒప్పందాలు, పత్రాలను మార్చుకోనున్నారు. అనంతరం మోడీ, ట్రంప్ అధికారిక మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
మధ్యాహ్నం 12.55 గంటలకు ఢిల్లిdలోని అమెరికా రాయబార కార్యాలయ సిబ్బందితో ట్రంప్ భేటీ కానున్నారు.
రాత్రి 7.30 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో విందులో ట్రంప్ పాల్గొననున్నారు. రాత్రి 10 గంటలకు అమెరికాకు ట్రంప్ బృందం తిరుగుపయనం కానున్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/