రవితేజ ‘రావణాసుర ‘ సెన్సార్ పూర్తి

మాస్ రాజా రవితేజ హీరోగా సుధీర్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ‘రావణాసుర’. ఏప్రిల్ 07 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న క్రమంలో చిత్ర యూనిట్..సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసింది. సినిమాను చూసిన యూనిట్..సినిమా కు ‘A’ సర్టిఫికెట్ జారీ చేసారు.

సాధారణంగా రవితేజ సినిమాలంటేనే ఎంటర్‌టైన్మెంట్..యాక్షన్ సీన్లు ఉన్నప్పటికీ A సర్టిఫికెట్ రావడం బహుశా చూసుండరు. కానీ ఈ ‘రావణాసుర’ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ చూస్తుంటే మాత్రం వయొలెన్స్ ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే A సర్టిఫికెట్ వచ్చిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ డైరెక్షన్లో.. నావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ లో రవితేజ సరసన ఏకంగా 5 గురు హీరోయిన్లు నటిస్తున్నారు. అనూ ఇమ్మాన్యూయేల్, మేఘా ఆకాష్, ఫరీయా అబ్దుల్లా, దీక్షా నగార్కర్, పూజిత పొన్నాడ నటించారు. అభిషేక్ నామా నిర్మించిన ఈ సినిమాకి రవితేజ నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ – భీమ్స్ సంగీత దర్శకులుగా వ్యవహరించారు.