పల్నాడు జిల్లాలో దారుణం ..ఆస్తి కోసం ముగ్గుర్ని చంపేశాడు

ఆస్తి కోసం ఎంతకైనా తెగిస్తున్నారు..సొంత కుటుంబ సభ్యులనే చంపేస్తున్నారు. ఇప్పటివరకు ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగగా..తాజాగా పల్నాడు జిల్లాలో ఇదే జరిగింది. ఆస్తి కోసం పిన్ని సోదరి, తమ్ముడిని అత్యంత కర్కశంగా హత్యచేశాడు నిందితుడు. పిన్ని కుటుంబానికి సంబంధించిన వారిని పూర్తిగా అంతమందిస్తే ఆస్తి సొంతం చేసుకోవచ్చనే దుర్మార్గపు ఆలోచనతో ఈ దారుణానికి పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళ్తే..

సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ళకు చెందిన షేక్ ఖాశీంకు ఇద్దరు కుమారులు. ఇద్దరికీ సమానంగాచెరి రెండెకరాల ఆస్తి ఇచ్చి, ఖాశీం మరణించాడు. కొంత కాలానికి ఇద్దరు అన్నదమ్ములు కుడా కాలం చేశారు. పెదమీరా సాహెబ్ పెద్ద కొడుకు ఖాశీం అతని కుమారుడు జాకీర్. ఇతని వాటాగా వచ్చిన పొలాన్నీ అప్పుల కారణంగా విక్రయించాడు. చినమీరా సాహెబ్ భార్య రహీమూన్ కు ముగ్గురు సంతానం. ఒక కుమార్తె ఇద్దరు కొడుకులు.. చిన మీరా సాహెబ్ మృతి చెందిన తర్వాత మగ్గురు బిడ్డలతో కలసి ధూళిపాళ్ళ లో నివసిస్తోంది‌. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న పెద్ద కుమారుడు జబ్బార్ కరోనా సెకండ్ వేవ్ లో మృతి చెందాడు. రెండవ కుమారుడు రహిమాన్ సత్తెనపల్లిలో ప్రైవేట్ స్కూల్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. ఉన్న రెండు ఎకరాల సాగు చేసుకుంటూ.. చిరు ఉద్యోగం చేస్తూ గడుపుతున్నాడు.

ఆప్పుల పాలై ఆస్తిని పోగొట్టుకున్న ఖాశీం తన చినాన్న ఆస్తిని కాజేయాలని మొదటి నుండి ప్లాన్ చేస్తున్నాడు. పిన్నమ్మ వద్దకు వచ్చి ఇద్దరు కుమారులలో‌ పెద్ద కుమారుడు చనిపోయాడు కనుక ఆస్తిని రెండు బాగాలు చేసీ తనకు ఒక బాగాన్ని ఇవ్వాలని గొడవ పడేవాడు. చాలా సార్లు పిన్ని రహీమూన్ వద్దకు వచ్చి ఆస్తి తనకు కూడా ఇవ్వాలని గొడవ పడే వాడు. అస్తీ తన బిడ్డలకే చెందుతోందని తేల్చి చెప్పడంతో కక్ష పెంచుకున్నాడు ఖాశీం. పినతల్లి కుటుంబాన్ని అడ్డు తొలగించుకుంటే ఇక తనకు అడ్డు ఉండదని.. పిన్నమ్మ పిల్లలలో‌ ఎవ్వరికీ పెళ్ళి కాలేదు కనుక వారసులు కూడా లేరని అడ్డు తప్పిస్తే వారి ఆస్తి తన సొంతమౌతుందని భావించాడు. పిన్ని కుటుంబం మొత్తాన్ని హత మార్చేందుకు ప్లాన్ చేసి, ఖాశీం తన కుమారుడు జాకీర్ తో కలసి ధూళిపాళ్ళ వెళ్ళాడు. పిన్ని రహిమూన్(65) వద్దకు వెళ్లి తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోశాడు. అది చూసి భయంతో బయటకు వెళ్ళేదుకు ప్రయత్నించిన సోదరి మాలాంబి(36) గమనించి ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. అంతకు ముందే పిన్నమ్మ కుమారుడు రహెమాన్ కూడా గొంతు పిసికి చంపాడు. ఇలా ఆస్తి కోసం ముగ్గుర్ని చంపాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఖాసిం ను అదుపులోకి తీసుకున్నారు.