తన ఫోన్ పోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన బండి సంజయ్

పేపర్ లీక్ ఘటన లో తనను పోలీసులు అరెస్ట్ చేసిన క్రమంలో తన ఫోన్ పోయిందని పోలీసులకు పిర్యాదు చేసారు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. కరీంనగర్‌లోని నివాసం నుంచి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తున్న సమయంలో తన ఫోన్ మిస్ అయ్యిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అరెస్ట్ చేసే క్రమంలో పడిపోయిందంటూ.. ఫోన్‌లో చాలా కీలక సమాచారం ఉందన్నారు. అయితే తమ దగ్గర ఫోన్ లేదని పోలీసులు చెబుతున్నారు.
ఇటీవల వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బండి సంజయ్ ఫోన్ అప్పగించి విచారణకు సహకరించాలని కోరారు. ఫోన్ అడిగితే లేదంటున్నారని ఆరోపించారు. కుట్రకోణం లేకపోతే బండి సంజయ్ తన ఫోన్ ఇవ్వొచ్చు కదా అని సీపీ వ్యాఖ్యానించారు. ఇప్పుడు, బండి సంజయ్ తన ఫోన్ పోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది.